logo

నవీన్‌ నివాస్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

భద్రక్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ భువనేశ్వర్‌లోని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇంటి (నవీన్‌ నివాస్‌) ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. నవీన్‌ నివాస్‌ ఎదుట ఉన్న చెట్టుపైకి ఎక్కి కిందకు దూకేందుకు ప్రయత్నించింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ఆమెను

Published : 26 Sep 2022 03:16 IST

మహిళను కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక ఉద్యోగి

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: భద్రక్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ భువనేశ్వర్‌లోని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇంటి (నవీన్‌ నివాస్‌) ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. నవీన్‌ నివాస్‌ ఎదుట ఉన్న చెట్టుపైకి ఎక్కి కిందకు దూకేందుకు ప్రయత్నించింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకుని, స్థానిక క్యాపిటల్‌ ఆసుపత్రికి తరలించారు. ‘నా సోదరుడు కొన్నేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. 23 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పోలీసులు హంతకులకు అరెస్టు చేయలేదు. నా భర్త నన్ను దూరం పెట్టాడు. ఇంతవరకు భరణం ఇవ్వలేదు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను’ అని ఆ మహిళ మీడియాకు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని