logo

ఆమెకు వైద్యం దూరం

రాష్ట్రంలో మహిళలకు అంతంతమాత్రంగా దక్కుతోన్న వైద్యసేవల పట్ల జాతీయ మానవ హక్కుల కమీషన్‌(ఎన్‌హెచ్‌ర్‌సీ) అసంతృప్తి వ్యక్తం చేసింది.

Published : 27 Jan 2023 01:49 IST

ఆసుపత్రికి గర్భిణిని తరలించేందుకు బంధువుల పాట్లు (పాతచిత్రం)

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మహిళలకు అంతంతమాత్రంగా దక్కుతోన్న వైద్యసేవల పట్ల జాతీయ మానవ హక్కుల కమీషన్‌(ఎన్‌హెచ్‌ర్‌సీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. మహిళలకు ముఖ్యంగా గర్భవతులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న గైనకాలజిస్టుల పోస్టులను ప్రస్తావిస్తూ ఆ కారణంగా గర్భిణులు సరైన వైద్యం అందడం లేదని సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ గుర్తుచేసింది. ఈ దిశగా వారికి నాణ్యమైన సేవలందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి సోమవారం సూచించింది. జయపురానికి చెందిన న్యాయవాది, మానవహక్కుల, ఆర్‌టీఐ కార్యకర్త అనూప్‌ కుమార్‌ పాత్ర్‌ ఫిర్యాదు మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పై విధంగా స్పందించింది. గైనకాలజిస్ట్‌ల కొరత కారణంగా సకాలంలో వైద్య సేవలందకపోవడం, రాష్ట్రంలో మాతాశిశు మరణాల పెరుగుదలకు కారణమవుతున్నాయని పాత్ర్‌ ఫిర్యాదులో ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని