logo

జీసీసీ లక్ష్యాలపై దృష్టి

గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ లక్ష్యాలను సాధించాలని అధికారులకు జీసీసీ ఎండీ జి.సురేష్‌కుమార్‌ సూచించారు. శనివారం సాలూరులో డీఎం మహేంద్రకుమార్‌, గుమ్మలక్ష్మీపురం, సాలూరు డివిజన్ల అధికారులతో సమీక్షించారు.

Published : 05 Feb 2023 04:36 IST

అధికారులతో సమీక్షిస్తున్న ఎండీ సురేష్‌కుమార్‌

సాలూరు, గ్రామీణం, న్యూస్‌టుడే: గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ లక్ష్యాలను సాధించాలని అధికారులకు జీసీసీ ఎండీ జి.సురేష్‌కుమార్‌ సూచించారు. శనివారం సాలూరులో డీఎం మహేంద్రకుమార్‌, గుమ్మలక్ష్మీపురం, సాలూరు డివిజన్ల అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది లక్ష్యం, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి వివరాలపై ఆరా తీశారు. డిపోలు, పెట్రోల్‌ బంకులు, వ్యవసాయ ఉత్పత్తులు, రుణాలు, ఇతర వ్యాపారాల లక్ష్యం రూ.60 కోట్లు ఉండగా రూ.42.5 కోట్లు సాధించినట్లు తెలిపారు. ఎనిమిది ఆర్‌బీకేల ద్వారా రూ.6 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఎండీ మాట్లాడుతూ.. చింతపండు కొనుగోలుకు రూపొందించిన మార్గదర్శకాలు పాటించాలన్నారు. ఎండు ఉసిరి, నల్ల జీడి, కుంకుడు       కాయలకు పెంచిన ధరలను అమలు చేసి కొనుగోలు చేయాలన్నారు. జీసీసీ పాత భవనాల మరమ్మతులకు ప్రతిపాదనలు చేసి పంపించాలన్నారు. బీఎంలు రామారావు, కృష్ణప్రసాదరావు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని