logo

ప్రభుత్వ మద్యం దుకాణంలో రూ.1.32 లక్షల చోరీ

మండలంలోని లచ్చంపేటలో ఉన్న  ప్రభుత్వ మద్యం దుకాణంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. రూ.1,32,210 నగదును అపహరించుకుపోయారని నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 31 May 2023 03:21 IST

సిబ్బందితో మాట్లాడుతున్న పోలీసులు

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలోని లచ్చంపేటలో ఉన్న  ప్రభుత్వ మద్యం దుకాణంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. రూ.1,32,210 నగదును అపహరించుకుపోయారని నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎం.ముకుందరావు వివరాల ప్రకారం.. ఈ దుకాణంలో పర్యవేక్షకునిగా పనిచేస్తున్న కుప్ప మహలక్ష్మీనాయుడు విక్రయాల ద్వారా వచ్చిన మొత్తాన్ని పెట్టెలో ఉంచి తాళం వేశాడు. కాపలాదారులు సూర్యారావు, సురేష్‌కు చెప్పి రాత్రి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం 11 గంటలకు వచ్చి చూసేసరికి పెట్టె తాళం తీసి ఉంది. అందులో నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. ఎస్సై, ఏఎస్సై టి.యువరాజు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని