logo

అందరి సహకారంతో జిల్లాకు గుర్తింపు

కొత్తగా ఏర్పడిన జిల్లా అనతికాలంలోనే జాతీయ స్థాయి గుర్తింపు సాధించి వివిధ కేటగిరీల్లో నాలుగు జాతీయ పురస్కారాలు పొందడం ఆనందంగా ఉందని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 02 Jun 2023 02:45 IST

పాలకొండ, పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: కొత్తగా ఏర్పడిన జిల్లా అనతికాలంలోనే జాతీయ స్థాయి గుర్తింపు సాధించి వివిధ కేటగిరీల్లో నాలుగు జాతీయ పురస్కారాలు పొందడం ఆనందంగా ఉందని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. పాలకొండలో రైతు భరోసా అయిదో విడత, పెట్టుబడి రాయితీ కింద 1,42,930 మంది రైతులకు రూ.107.19 కోట్ల నమూనా చెక్కును గురువారం అందజేశారు. ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ సీతంపేట, పార్వతీపురం, కురుపాం, సాలూరులో ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఐటీఐలు ఉన్నాయని, డివిజన్‌ కేంద్రం పాలకొండలో ప్రభుత్వ ఐటీఐ  కళాశాల లేకపోవడంతో యువత ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఇక్కడ ఏర్పాటు చేసేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. ఈ ప్రాంత రైతులకు ప్రయోజనం కలిగేలా తోటపల్లి జలాశయం ఆధునికీకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్సీ విక్రాంత్‌ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌కమర్‌ను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సత్కరించారు. నాగవంశం కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ ఎన్‌.శివప్రసాద్‌, ఉప ఎంపీపీలు కె.సూర్యప్రకాశ్‌, వి.అనిల్‌కుమార్‌, జేడీ రాబర్ట్‌పాల్‌ పాల్గొన్నారు.

ఎండ వేడితో అవస్థలు

సమావేశానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు టెంట్లు వేసినా వేడి గాలులకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రారంభంలో నీరు, మజ్జిగ అందించారు. అనంతరం నీరు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కొందరు రైతులు సమావేశం మధ్యలోనే వెనుదిరిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని