logo

వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా చేరికలు

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి రాజాం నియోజకవర్గ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు.

Published : 28 Mar 2024 04:10 IST

నాయకులకు కండువా వేస్తున్న కోండ్రు

రాజాం గ్రామీణం, న్యూస్‌టుడే: చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి రాజాం నియోజకవర్గ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. మండలంలోని కంచరాంలో జడ్పీటీసీ మాజీ సభ్యులు టంకాల పాపినాయుడు, రౌతు రామినాయుడు ఆధ్వర్యంలో బుధవారం 200 కుటుంబాలవారు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. వారికి కండువాలు వేసి కోండ్రు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. మాట తప్పను మడమ తిప్పనని చెప్పి అన్ని వర్గాల ప్రజలకూ అన్యాయం చేశారని మండిపడ్డారు. అనంతరం వీఆర్‌అగ్రహారం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు పార్టీలో చేరాయి. సూర్యప్రకాశ్‌, వెంకట మన్మధరావు, వెంకటరావు పాల్గొన్నారు.

గులివిందాడ గ్రామస్థులతో కలిసి నినాదాలు చేస్తున్న కూటమి ఎస్‌.కోట నియోజకవర్గ అభ్యర్థి లలితకుమారి

లక్కవరపుకోట మండలంలో..

లక్కవరపుకోట: తెదేపాతోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేబీఏ.రామ్‌ప్రసాద్‌ అన్నారు. వేపాడ మండలం పెదకృష్ణరాజపురానికి చెందిన మాజీ సర్పంచి ముమ్ములూరి రామచంద్రుడు, సింగంపల్లి ఈశ్వరరావు, ఎం.పార్వతి, ఎస్‌.శ్రీదేవి ఆధ్వర్యంలో 100 కుటుంబాలవారు బుధవారం ఎల్‌.కోట వచ్చి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. నాయకులు దాసరి లక్ష్మి, కొట్యాడ రమణమూర్తి, జె.మహేష్‌, ఎం.వెంకటరావు, ఆర్‌.జగన్నాథ్‌, పెద అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. బీ కొత్తవలస మండలం గులివిందాడకు చెందిన వార్డు సభ్యులు జి.శంకర్‌, ఎం.శ్రీను, జి.ముత్యాలనాయుడు, జె.సత్యనారాయణ 50 కుటుంబాలు ఎస్‌.కోట నియోజకవర్గ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీ గ్రామాధ్యక్షుడు గవర ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని