logo

బిల్లులు రాక.. నిర్మాణాలు సాగక

Published : 28 Mar 2024 04:17 IST

ధ్వంసమైన సిమెంటు నిర్మాణాలు

గిరిజన విద్యార్థులకు వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మూడేళ్ల కిందట సాలూరు, పాచిపెంట మండలాలతో పాటు సాలూరు పట్టణంలోని వసతి గృహాల్లో సదుపాయాల కల్పనకు రూ.5.28 కోట్లు నిధులు మంజూరు చేసింది. 2020లో బంగారమ్మకాలనీ, బంగారమ్మపేట గిరిజన బాలుర, బాలికల వసతి గృహాల్లో వంట షెడ్లు, భోజనశాల నిర్మాణానికి రూ.కోటి కేటాయించారు. నిర్మాణాలకు భూమి పూజ చేశారు. మామిడిపల్లిలోని బాలికల వసతి గృహం అభివృద్ధికి రూ.3.78 కోట్లిచ్చారు. వేటగానివలసలో కిచెన్‌ షెడ్‌, భోజనశాలకు రూ.50 లక్షలతో పనులు చేపట్టారు. మామిడిపల్లిలో పునాదుల్లోనే పనులు ఆగిపోయాయి. బంగారమ్మపేటలో వంట షెడ్‌, భోజనశాల పనులు పూర్తయినా, ఫ్లోరింగ్‌ పలకలు ఏర్పాటు చేయలేదు. గతంలో నిర్మించినవి కూడా పాడయ్యాయి.

మూడేళ్లుగా పునాదులకే పరిమితమైన భోజన శాల


బిల్లులు రాక అవస్థలు..

బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో అప్పులు చేసి మరీ నిర్మాణాలు చేపట్టామని గుత్తేదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ‘కిచెన్‌ షెడ్లు, భోజనశాలల పనులు 70 శాతం అయ్యాయి. ఒప్పందం మేరకు మిగిలినవి పూర్తి చేయాలని నోటీసులు జారీచేశాం. త్వరలో అందుబాటులోకి తెస్తాం’ అని ఐటీడీఏ డీఈ మణికుమార్‌ చెప్పారు.

న్యూస్‌టుడే, సాలూరు, పాచిపెంట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని