logo

చందనోత్సవ వైఫల్యాలపై నివేదిక ఏదీ..?: అశోక్‌

సింహాచలం దేవస్థానంలో గతేడాది చందనోత్సవ సమయంలో జరిగిన వైఫల్యాలపై చేపట్టిన విచారణ నివేదిక ఇప్పటికీ బయటకు రాలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు అన్నారు.

Updated : 20 Apr 2024 03:52 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలం దేవస్థానంలో గతేడాది చందనోత్సవ సమయంలో జరిగిన వైఫల్యాలపై చేపట్టిన విచారణ నివేదిక ఇప్పటికీ బయటకు రాలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు అన్నారు. వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వయంప్రతిపత్తిని, కీర్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం దేవస్థాన కార్యనిర్వహణాధికారికి లేఖ రాయడంతోపాటు ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు. గతేడాది ప్రొటోకాల్‌ పేరిట పెద్దఎత్తున వీఐపీలను దర్శనానికి పంపించడంతో సామాన్య భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ‘నాటి వైఫల్యాలపై దేవదాయశాఖకు జేసీ పంపిన నివేదికను ఇప్పటికీ దేవస్థానం తెప్పించుకోలేదు. ఈ ఏడాది చందనోత్సవం సమీపించినా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించలేదు’ అని అసహనం వ్యక్తం చేశారు. ‘చందనోత్సవంపై ఈ నెల 10న జరిగిన సమీక్ష సమావేశంలో చర్చించిన అంశాలను కలెక్టర్‌ ఆమోదం కోసం పంపారు. కలెక్టర్‌కు నివేదిక పంపాలని, ఆయన అంగీకరిస్తేనే చర్యలు చేపట్టాలని ఏ చట్టంలో ఉంది’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు