logo

కన్నబిడ్డే కాదంటున్నాడమ్మా...!

అల్లారుముద్దుగా పెంచిన కొడుకు... ఆసరాగా ఉండాల్సిన సమయంలో పోషణ పట్టించుకోకుండా వదిలేయడంతో ఓ వృద్ధ దంపతులు ఆర్డీవోను ఆశ్రయించారు. మార్కాపురం పట్టణం వడ్డెబజారుకు చెందిన భీమిశెట్టి రామయ్య, రత్నమ్మ దంపతులు. వీరికి ఓ కుమారుడు,

Published : 24 May 2022 02:20 IST

ఆర్డీవో లక్ష్మీశివజ్యోతికి గోడు తెలియజేస్తున్న వృద్ధ దంపతులు

అల్లారుముద్దుగా పెంచిన కొడుకు... ఆసరాగా ఉండాల్సిన సమయంలో పోషణ పట్టించుకోకుండా వదిలేయడంతో ఓ వృద్ధ దంపతులు ఆర్డీవోను ఆశ్రయించారు. మార్కాపురం పట్టణం వడ్డెబజారుకు చెందిన భీమిశెట్టి రామయ్య, రత్నమ్మ దంపతులు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ముగ్గురికీ వివాహాలు చేశారు. కొడుకు, కోడలు ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తల్లిదండ్రుల పోషణ పట్టించుకోవాల్సిన కుమారుడు... వేరు కాపురం పెట్డాడు. దీంతో ఆరు పదుల వయసు దాటిన ఆ వృద్ధులకు పోషణ భారమైంది. పలుమార్లు చెప్పినా, పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా కొడుకు పట్టించుకోకపోవడంతో... ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి వద్ద సోమవారం తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతి నెలా భృతి ఇప్పించి, బతికేంతవరకు బాగోగులు చూసేలా తమ కొడుకును ఒప్పించాలని కన్నీటి పర్యంతమయ్యారు. చలించిపోయిన ఆర్డీవో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. - న్యూస్‌టుడే, మార్కాపురం గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని