logo

ఉక్కు సంకల్పానికి 500 రోజులు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమం 500 రోజులు పూర్తయిన సందర్భంగా పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం ఒంగోలులోని

Published : 27 Jun 2022 02:17 IST

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమం 500 రోజులు పూర్తయిన సందర్భంగా పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం ఒంగోలులోని అద్దంకి బస్టాండ్‌లో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.రవీంద్రబాబు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనలో దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్‌ చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పరిశ్రమ ప్రైవేటీకరణ అనేది అందులో పనిచేసే కార్మికులు, భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్య మాత్రమే కాదన్నారు. ఇది రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి సంబంధించినదని పేర్కొన్నారు. మూడు లక్షల కోట్ల విలువజేసే ప్రజల ఆస్తిని కారుచౌకగా అమ్మే ప్రయత్నాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో కార్మిక సంఘాల నాయకులు కాలం సుబ్బారావు, ఎం.ఎస్‌.సాయి, జీవీ.కొండారెడ్డి, పి.కల్పన, శ్రీరామ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని