logo

కేజీబీవీల్లో అత్యవసర నియామకాలు

కొత్తగా ఇంటర్మీడియట్‌ కోర్సులు ప్రారంభించిన కేజీబీవీలతో పాటు, పాత వాటిలో బోధకుల కొరత ఏర్పడింది. దీంతో అత్యవసరంగా అతిథి అధ్యాపకులను నియమించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 166 మంది అతిథి అధ్యాపకులు కావాలని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో బి.విజయభాస్కర్‌

Published : 10 Aug 2022 03:23 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే:

కొత్తగా ఇంటర్మీడియట్‌ కోర్సులు ప్రారంభించిన కేజీబీవీలతో పాటు, పాత వాటిలో బోధకుల కొరత ఏర్పడింది. దీంతో అత్యవసరంగా అతిథి అధ్యాపకులను నియమించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 166 మంది అతిథి అధ్యాపకులు కావాలని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో బి.విజయభాస్కర్‌ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో కాంట్రాక్టు అధ్యాపకులను నియమించేలోపు గంటల పద్ధతిలో పనిచేసేందుకు అవసరమైన వారిని విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. ‌్ర జిల్లాలో 37 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 22 కేటగిరీల సబ్జెక్టుల బోధనకు సిబ్బంది అవసరం.

* ఖాళీల వివరాలు ఇలా...: సీఆర్‌టీ తెలుగు 2, ఆంగ్లం 5, హిందీ ఒకటి, గణితం 7, పీఎస్‌ 7, బీఎస్‌ 6, ఎస్‌ఎస్‌ 5 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించారు. పీజీటీ కేటగిరీలో ఆంగ్లం 25, తెలుగు 24, జీఎఫ్‌సీ 3, ఎకనామిక్స్‌ 5, సివిక్స్‌ 4, కామర్స్‌ 1, హిస్టరీ 4, బోటనీ 3, కెమిస్ట్రీ 22, జువాలజీ 4, ఫిజిక్స్‌ 19, గణితం 16, కంప్యూటర్స్‌ ఒకటి, డెయిరీ టెక్నాలజీ ఒకటి, బయోకెమిస్ట్రీ ఒక పోస్టు.

* గంట బోధనకు రూ.250...: అతిథి అధ్యాపకుల్లో సీఆర్‌టీలకు గంటకు రూ.200, పీజీటీలకు రూ.250 చొప్పున నెలకు 60 గంటలకు మించకుండా చెల్లిస్తారు. 6 నుంచి 12 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధించాలి. ఆరు నుంచి పది వరకు బోధించేవారిని సీఆర్‌టీలుగా, ఇంటర్‌ బోధించేవారిని పీజీటీలుగా పిలుస్తారు. పీజీటీలు నెలకు 48 గంటలు మించకుండా బోధించాల్సి ఉంటుంది. అంతవరకే వారికి బడ్జెట్‌ కేటాయింపు ఉంటుంది. పదవీ విరమణ పొందిన మహిళా ఉపాధ్యాయినులు, పీజీలో 50 శాతం మార్కులతో బీఈడీ అర్హతగల మహిళలు అర్హులు. పూర్తిచేసిన దరకాస్తులను ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సమగ్రశిక్ష కార్యాలయంలో సమర్పించాలని డీఈవో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని