logo

తప్పులు సరిచేయమంటే... సరఫరా ఆపేశారు

విద్యుత్తు బిల్లులు చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలకు ఆ శాఖాధికారులు సరఫరా నిలిపివేస్తున్నారు. అయితే ఇచ్చిన నోటీసులో తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేస్తే బిల్లులు

Published : 12 Aug 2022 02:16 IST

హెచ్‌ఎంపాడు విద్యావనరుల కేంద్రానికి విద్యుత్తు శాఖ అధికారులు ఇచ్చిన నోటీసు

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: విద్యుత్తు బిల్లులు చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలకు ఆ శాఖాధికారులు సరఫరా నిలిపివేస్తున్నారు. అయితే ఇచ్చిన నోటీసులో తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేస్తే బిల్లులు చెల్లిస్తామని చెప్పినా అధికారులు పట్టించుకోకుండా ఈ నెల ఆరో తేదీన హనుమంతునిపాడు మండల విద్యావనరుల కేంద్రానికి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. దీంతో వారం రోజులుగా కార్యాలయంలో పనులు నిలిచిపోయాయి. ఈ విషయంపై ఎంఈవో పెద్దిరాజు మాట్లాడుతూ విద్యా వనరుల కేంద్రం సర్వీసు నంబరు 231 కాగా బిల్లు రూ.1.52 లక్షలు వచ్చిందన్నారు. అయితే 365 సర్వీసు నంబరుపై ఉన్న రూ.64 వేల బకాయిలు కూడా మాకు కలిపి నోటీసు అందజేశారన్నారు. ఇది సరిచేయాలని విద్యుత్తు శాఖాధికారులను కోరగా పరిశీలిస్తామని చెప్పారని, అయితే ఈ నెల ఆరో తేదీన ఎటువంటి సమాచారం లేకుండా విద్యుత్తు సరఫరా నిలిపివేశారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే నెల 10 వరకు సమయం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ కోరినా విద్యుత్తు శాఖాధికారులు లెక్కచేయకుండా తమ కార్యాలయానికి విద్యుత్తు సరఫరా నిలిపివేయడం సమంజసం కాదని వాపోయారు. ఈ విషయంపై ఏఈ దినకర్‌ బాబును వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరఫరా నిలిపివేశామన్నారు. మూతబడిన పాఠశాలల విద్యుత్తు బిల్లులు కూడా కలిసి ఉంటామని, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని