logo

గిరిజనులపై సెబ్‌ అధికారుల దాడి

గిరిజనులపై సెబ్‌ అధికారులు దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరో వైపు తమ విధులకు గిరిజనులు ఆటంకం కలిగించారని సెబ్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దోర్నాల పోలీసులు  కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Published : 24 Jan 2023 03:05 IST

సామాజిక మాధ్యమాల్లో వీడియో హల్‌చల్‌

మార్కాపురం నేర విభాగం, న్యూస్‌టుడే: గిరిజనులపై సెబ్‌ అధికారులు దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరో వైపు తమ విధులకు గిరిజనులు ఆటంకం కలిగించారని సెబ్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దోర్నాల పోలీసులు  కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మార్కాపురం సెబ్‌ యూనిట్‌ పరిధిలోని దోర్నాల మండలం చింతల గ్రామంలో సారా విక్రయిస్తున్నట్లు సెబ్‌ అధికారులకు సమాచారం అందింది. సెబ్‌ సీఐ రాగమయి సిబ్బందితో కలిసి ఈ నెల 5వ తేదీన గ్రామానికి చేరుకొని కుడుముల మూగెన్న అనే వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని వాహనంలో ఎక్కించడంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు అంధురాలైన మూగెన్న కుమారై అంజమ్మను నెట్టి వేయడంతో ఆమె కింద పడిపోయిన దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. దీనిపై సెబ్‌ అధికారులు మూగెన్నపై కేసు నమోదు చేశారు. మరో వైపు విధులకు ఆటంకం కలిగించారని మరుసటి రోజు సెబ్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కుడుముల నాని, అంజమ్మపై ఈ నెల 6వ తేదీన దోర్నాల పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ఎస్సై శ్రీనివాసరావు నిందితులను స్టేషన్‌కి పిలిచి మాట్లాడారు. అయితే.సెబ్‌ అధికారుల దాడి దృశ్యాలు విడుదల చేయడం కలకలం రేపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని