logo

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తగదు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద బుధవారం సామూహిక దీక్షలు చేపట్టారు.

Published : 26 Jan 2023 02:56 IST

నినాదాలు చేస్తున్న సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద బుధవారం సామూహిక దీక్షలు చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు లేకపోయినా, సొంత గనులు కేటాయించకపోయినా విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్విఘ్నంగా నడుస్తోందన్నారు. అటువంటి పరిశ్రమను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రెండేళ్లుగా పోరాటాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం... ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని విమర్శించారు. ఈ నెల 30న విశాఖలో లక్ష మందితో నిర్వహించనున్న ‘కార్మిక మహా గర్జన’ను జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్‌.నారాయణ మాట్లాడుతూ... ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఓటర్లు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పీవీఆర్‌ చౌదరి, నాయకులు ఆర్‌.రామకృష్ణ, ఎం.విజయ, ఎం.వెంకయ్య, వీరారెడ్డి, యు.ప్రకాశరావు తదితరులు పాలొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని