సకారాత్మక ఆలోచనా ధోరణితోనే ప్రగతి
వ్యవస్థల పనితీరుతో పాటు... అందరూ సకారాత్మక ఆలోచన ధోరణితో ముందుకు సాగితేనే సమాజం సర్వతోముఖాభివృద్ది చెందుతుందని సంయుక్త కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు.
జడ్పీ కార్యాలయంలో ఏవో దేవసేనకుమారికి ప్రశంసా పత్రం అందిస్తున్న ఛైర్‌పర్సన్ వెంకాయమ్మ, చిత్రంలో సీఈవో జాలిరెడ్డి
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వ్యవస్థల పనితీరుతో పాటు... అందరూ సకారాత్మక ఆలోచన ధోరణితో ముందుకు సాగితేనే సమాజం సర్వతోముఖాభివృద్ది చెందుతుందని సంయుక్త కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. 74వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా గురువారం... ప్రకాశం భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. డీఆర్వో ఓబులేసు, కలెక్టరేట్‌లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
* జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈవో బి.జాలిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఉద్యోగులు పాల్గొన్నారు. 25 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
రాజ్యాంగానికి బద్ధులై ఉండాలి...
ఒంగోలు న్యాయ విభాగం, న్యూస్‌టుడే: గణతంత్ర సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి జాతీయ జెండా ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి బద్ధులై ఉండాలన్నారు. అదనపు జిల్లా జడ్జిలు ఆర్.శివకుమార్, ఎం.ఎ.సోమశేఖర్, డి.అమ్మన్నరాజా, ఆర్.శరత్‌బాబు, శాశ్వత లోక్ అదాలత్ ఛైర్మన్ ఎస్.వి.నరసింహరాజు, సీనియర్ సివిల్ జడ్జిలు కె.సత్యకుమారి, ఎస్.జయలక్ష్మి, కె.శ్యాంబాబు, జూనియర్ జడ్జిలు ఎన్.రాధిక, పి.గాయత్రి, ఆర్.వెంకటేశ్వర శర్మ, వి.దీప్తి, ఎ.సలోమి, న్యాయస్థానాల సిబ్బంది పాల్గొన్నారు.
* బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఉపాధ్యక్షుడు ఐ.సుబ్బారావు, మహిళా ప్రతినిధి ఎన్.ధనలక్ష్మి, గ్రంథాలయ కార్యదర్శి పి.సంజీవరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాది గుమస్తాల సంఘం కార్యాలయం వద్ద అధ్యక్షుడు ఫణి రాజేంద్ర... జెండా ఎగురవేశారు.
ప్రకాశం భవన్‌లో జెండా వందనం చేస్తున్న జేసీ అభిషిక్త్ కిషోర్, అధికారులు, సిబ్బంది
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pope Francis: నేను ఆరోగ్యంగా ఉన్నా: పోప్ ఫ్రాన్సిస్
-
Movies News
Social look: జాన్వీ పూసల డ్రెస్.. కావ్య హాట్ స్టిల్స్.. సన్నీ ఫొటో షూట్
-
General News
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఉపశమనం
-
India News
Rajnath Singh: ఆల్ టైం గరిష్ఠానికి రక్షణ రంగ ఎగుమతులు
-
Politics News
Chandrababu: చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: చంద్రబాబు
-
India News
Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!