logo

ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా కుర్రా

జిల్లా ఒలింపిక్‌ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. డాక్టర్‌ పర్వతరెడ్డి ఆనంద్‌ మినీ స్టేడియంలో శనివారం ఈ ఎంపిక నిర్వహించారు.

Updated : 29 Jan 2023 02:03 IST

ఎంపికైన నూతన కార్యవర్గ సభ్యులు

ఒంగోలు క్రీడావిభాగం, న్యూస్‌టుడే: జిల్లా ఒలింపిక్‌ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. డాక్టర్‌ పర్వతరెడ్డి ఆనంద్‌ మినీ స్టేడియంలో శనివారం ఈ ఎంపిక నిర్వహించారు. అధ్యక్షుడిగా కుర్రా భాస్కరరావు (ఖో-ఖో), ఉపాధ్యక్షులుగా పి.లెమూయేల్‌రాజు (జూడో), జి.ధనుంజయరావు (వాలీబాల్‌), వి.నాగేశ్వరరావు (ఫెన్సింగ్‌), వి.సుందరరామిరెడ్డి (రగ్బీ) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బొడ్డు సుబ్బారావు (బాక్సింగ్‌)ను ఎంపిక చేశారు. సంయుక్త కార్యదర్శులుగా కె.శ్రీనివాసరావు (రెజ్లింగ్‌), డి.రవిప్రసాద్‌ (సెపక్‌తక్రా), ఎస్‌.సురేష్‌బాబు (బాస్కెట్‌బాల్‌), డి.రమేష్‌ (కబడ్డీ), కోశాధికారిగా ఎస్‌.చంద్రశేఖర్‌రావు (ఆక్వాటిక్స్‌) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఎ.వి.సుబ్బారావు (జిమ్నాస్టిక్స్‌), బి.జగదీష్‌బాబు (మోడరన్‌ పెంటాథ్లాన్‌), పి.ఉదయరాజు (బాక్సింగ్‌), బి.అంకబాబు (టేబుల్‌ టెన్నిస్‌), ఎస్కే సలాం (తైక్వాండో), ఎ.రోజర్‌బిన్నీ (ఫుట్‌బాల్‌) ఎంపికయ్యారు. ఎన్నికల పరిశీలకుడిగా కె.వేణుగోపాల్‌, రిటర్నింగ్‌ అధికారిగా న్యాయవాది పిడుగురాళ్ల సుబ్బారావు వ్యవహరించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని నూతన సభ్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని