logo

గ్రామీణ పేదలను విస్మరించిన కేంద్ర బడ్జెట్‌

వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ పేదలను విస్మరించేలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఉందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ ఒంగోలు ఎల్‌బీజీ భవన్‌ వద్ద గురువారం నిరసన చేపట్టారు.

Published : 03 Feb 2023 02:05 IST

నిరసన తెలుపుతున్న రైతు సంఘం, వ్యకాసం నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ పేదలను విస్మరించేలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఉందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ ఒంగోలు ఎల్‌బీజీ భవన్‌ వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ఏడాదితో పోలిస్తే ఆహార రాయితీపై రూ.90 వేల కోట్ల మేర కోత వేశారన్నారు. గ్రామీణ పేదల జీవనానికి ఆసరాగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా రూ.30 వేల కోట్లు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు కనీస మద్దతు ధరల చట్టానికి రూపకల్పన చేస్తామని చెప్పి... కార్పొరేట్లకు అనుకూలమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. నిరసనలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, నాయకులు పెంట్యాల హనుమంతరావు, ఎస్కే మాబు, సూదనగుంట నరసింహారావు, తిరుపతయ్య, జి.రవికుమార్‌, రఘురాం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని