logo

గెలిపిస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తా

మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ తరఫున బరిలో దిగిన టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి బాబురెడ్డి, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డిలను గెలిపించాలని వివధ సంఘాల ప్రతినిధులు కోరారు.

Published : 06 Feb 2023 01:51 IST

పీడీఎఫ్‌ అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతున్న వివిధ సంఘాల ప్రతినిధులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ తరఫున బరిలో దిగిన టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి బాబురెడ్డి, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డిలను గెలిపించాలని వివధ సంఘాల ప్రతినిధులు కోరారు. వారికి మద్దతుగా స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో ఆదివారం సంఘీభావ సభ నిర్వహించారు. యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.రవి ఆహ్వానం పలకగా జిల్లా అభివృద్ధి వేదిక ప్రతినిధి గోపాలరెడ్డి అధ్యక్షత వహించారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్‌. లక్ష్మణరావు, యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో గెలిపిస్తే శాసనమండలి వేదికగా నిరుద్యోగుల సమస్యలపై పోరాడి న్యాయం చేస్తామన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీల అడుగుజాడల్లో పయనిస్తామని తెలిపారు. టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పి.బాబురెడ్డి మాట్లాడుతూ 36 సంవత్సరాలు ఉపాధ్యాయ ఉద్యమంలో ఉన్నానని చెప్పారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ యువత, పెన్షనర్ల ప్రయోజనాల కోసం పనిచేశారని, భవిష్యత్తులో కూడా అది కొనసాగి తీరుతుందన్నారు. సభలో యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు వీరారెడ్డి, బాపట్ల యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీనివాసరావు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, మద్దతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని