logo

దోర్నాల దారిలో కన్నడిగుల సందడి

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో ఈ నెల 19 నుండి 23 వరకు నిర్వహించనున్న ఉగాది బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.

Published : 19 Mar 2023 04:48 IST

నేటి నుంచి రాత్రి వేళా వాహనాలకు అనుమతి

శ్రీశైలం దారిలో బారులు తీరిన వాహనాలు

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో ఈ నెల 19 నుండి 23 వరకు నిర్వహించనున్న ఉగాది బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రంలో వెలసిన భ్రమరాంబికా దేవిని కర్ణాటక వాసులు తమ ఇంటి ఆడపడుచుగా కొలుస్తారు. ఆ క్రమంలోనే ఉగాది వేడుకల్లో అమ్మవారికి సారె సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగా వారంతా ప్రత్యేక వాహనాలు, కాలినడకన క్షేత్రానికి చేరుకుంటున్నారు. పాదయాత్రగా వచ్చేవారు నంద్యాల జిల్లా వెంకటాపురం నుంచి నల్లమల అటవీ ప్రాంతం లోంచి; వాహనాల్లో వచ్చేవారు దోర్నాల మీదుగా వెళ్తున్నారు. వాహనాలకు రాత్రి వేళ అనుమతి లేకపోవడంతో... శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం ఆరు గంటల వరకు వందలాది వాహనాలు నిలిచిపోయాయి.

వన్యప్రాణులకు హాని తలపెట్టొద్దు...: పెద్దదోర్నాల - శ్రీశైలం ఘాట్ రహదారిలో ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు రాత్రి వేళల్లోనూ వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై నిషేధం ఉంది. ఉత్సవాలకు వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ వెసులుబాటు కల్పిస్తున్నామని... వన్యప్రాణులకు హాని లేకుండా చోదకులు తమ వాహనాలు నడపాలని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని