logo

నాగులవరంలో 48.75 మి.మీ. వాన

జిల్లాలోని పలు మండలాల్లో శనివారం మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు పలు చోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.

Published : 26 Mar 2023 02:16 IST

దొనకొండ: కొచ్చర్లకోటలో ఓ ఇంటిపై పడిన విద్యుత్తు స్తంభం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు మండలాల్లో శనివారం మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు పలు చోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. నాగులవరం(అర్ధవీడు)లో 48.75 మి.మీ పడింది. కనిగిరి 45.0, రుద్రసముద్రం(దొనకొండ) 28.25, బేస్తవారపేట 26.25, హనుమంతునిపాడు 20.75, దరిమడుగు(మార్కాపురం) 18.25, గొట్లగట్టు(కొనకనమిట్ల) 18.0, కొలుకుల(యర్రగొండపాలెం) 13.0, కంభాలపాడు(పొదిలి) 13.0, యండ్రపల్లి(పుల్లలచెరువు) 12.25, కోవిలంపాడు(సీఎస్‌పురం) 11.50, తోకపల్లి(పెద్దారవీడు) 10.50 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. దొనకొండ మండలం కొచ్చర్లకోటలో ఓ ఇంటిపై విద్యుత్తు స్తంభం విరిగిపడింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం కాలేదు. ఈ మండలంలో రాత్రి 8 వరకు విద్యుత్తు నిలిచిపోయింది. కనిగిరిలో వీధులన్నీ జలదిగ్బంధమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని