logo

2021లో దరఖాస్తులు.. ఏవీ ఉద్యోగాలు?

‘2021లో గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన జారీ చేస్తే దరఖాస్తు చేసుకున్నాం.. అప్పటి నుంచి ఇంతవరకు ఫలితాలు ప్రకటించలేదు.. ఇంకా జాప్యం చేస్తే, సరైన పద్ధతిలో భర్తీ చేయకుంటే ఆమరణ దీక్ష చేపడతాం’ అని విభిన్న ప్రతిభావంతులు హెచ్చరించారు.

Updated : 28 Mar 2023 04:49 IST

అధికారిణి కోసం కార్యాలయంలో వేచి ఉన్న విభిన్న ప్రతిభావంతులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘2021లో గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన జారీ చేస్తే దరఖాస్తు చేసుకున్నాం.. అప్పటి నుంచి ఇంతవరకు ఫలితాలు ప్రకటించలేదు.. ఇంకా జాప్యం చేస్తే, సరైన పద్ధతిలో భర్తీ చేయకుంటే ఆమరణ దీక్ష చేపడతాం’ అని విభిన్న ప్రతిభావంతులు హెచ్చరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విభిన్న ప్రతిభావంతులు ఒంగోలులోని ఆ శాఖ కార్యాలయానికి సోమవారం వచ్చారు. ఉద్యోగాల భర్తీ విషయమై ఏడీ అర్చనతో చర్చించేందుకు నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఆమె లేకపోయారు. దీంతో గంటకు పైగా కార్యాలయంలోనే కూర్చున్నారు. అయినప్పటికీ ఏడీ రాకుండటంతో నిరాశగా వెనుదిరిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కొందరు నాయకులు చెప్పినట్లు అధికారులు పనిచేయడం కారణంగానే అర్హులైన అభ్యర్థులకు అన్యాయం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పనితీరుపై మూడు నెలలకోసారి సమీక్షించి తమ సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని