logo

నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు చర్యలు

వినియోగదారులు, రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ ఎస్‌ఈ సత్యనారాయణ తెలిపారు.

Published : 30 Mar 2023 02:33 IST

సిబ్బందితో సమీక్షిస్తున్న ఎస్‌ఈ సత్యనారాయణ

పామూరు, న్యూస్‌టుడే: వినియోగదారులు, రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ ఎస్‌ఈ సత్యనారాయణ తెలిపారు. పామూరు విద్యుత్తు శాఖ కార్యాలయాన్ని తనిఖీచేసి ఆ శాఖ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. లోఓల్టేజి సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు జిల్లాలో పలు విద్యుత్తు ఉప కేంద్రాల్లో 5 ఎంవీఏ పరివర్తకాల స్థానంలో 8 ఎంవీఏ పరివర్తకాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో లోఓల్టేజి సమస్య  దూరం చేసేందుకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. వేసవిలో విద్యుత్తు సమస్యలు లేకుండా సిబ్బంది చూడాలన్నారు. పామూరు మండలంలో ప్రభుత్వ, గృహ, వ్యవసాయ అన్నిరకాల విద్యుత్తు బకాయిలు రూ.6.20 కోట్లు ఉన్నట్లు తెలిపారు. వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కనిగిరి ఈఈ ఎం.నాగేశ్వరరావు, డీఈఈ టి.శ్రీకాంత్‌, పామూరు, సి.ఎస్‌.పురం వెలిగండ్ల ఏఈఈలు జిలానీ, రాజేష్‌, రసూల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని