logo

భారీగా అక్రమ మద్యం స్వాధీనం

అర్థవీడు మండలం పోతురాజుటూరు- యాచవరం గ్రామాల నడుమ కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేసినట్లు మార్కాపురం సెబ్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

Published : 28 Mar 2024 02:10 IST

తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

కంభం, న్యూస్‌టుడే : అర్థవీడు మండలం పోతురాజుటూరు- యాచవరం గ్రామాల నడుమ కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేసినట్లు మార్కాపురం సెబ్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌ తెలిపారు. స్థానిక సెబ్‌ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. కాకర్ల ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న కొప్పుల వెంకట రమేష్‌, అక్కడే వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న దార్ల అనిల్‌, అదనపు డబ్బులకు ఆశపడి యాచవరంలో గొలుసు దుకాణం నిర్వహిస్తున్న యామ చిన్న వెంకటేశ్వర్లుతో కలిసి బుధవారం నాడు కారులో 288 క్వార్టర్‌ సీసాలను తరలిస్తుండగా పట్టుకున్నారు. కారును ఆపి అధికారులు తనిఖీ చేసి మూడు మూటల్లో 180 ఎంఎల్‌ సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో వెంకట రమేష్‌, అనిల్‌ను అరెస్టు చేయగా, మరో నిందితుడు యామ చిన్న వెంకటేశ్వర్లు పరారైనట్లు వెల్లడించారు. ఆ మద్యాన్ని ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు చెప్పారు. మద్యం సీసాలు, కారు, చరవాణుల విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితులను గిద్దలూరు కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు. 51.8 లీటర్ల మద్యం ఉన్నట్లు వివరించారు. అక్రమంగా మద్యం, మత్తు పదార్థాలు వంటివి తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీఐ ఎం.బాలకృష్ణ, ఎస్సై వి.ఆర్‌.సత్యనారాయణరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని