logo

ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు

ఎన్నికల ప్రచారం, ఇతరత్రా రాజకీయ కార్యక్రమాల్లో  పాల్గొంటే కఠిన చర్యలు తప్పవన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కొందరు వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిపై వేటు చేసినా.. వారు గడిన పడటం లేదు.

Published : 28 Mar 2024 02:13 IST

ప్రచారాల్లో వాలంటీర్లు, ఉపాధి సహాయకులు

తాళ్లూరు, దర్శి, న్యూస్‌టుడే : ఎన్నికల ప్రచారం, ఇతరత్రా రాజకీయ కార్యక్రమాల్లో  పాల్గొంటే కఠిన చర్యలు తప్పవన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కొందరు వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిపై వేటు చేసినా.. వారు గడిన పడటం లేదు. అధికార వైకాపా నాయకులు మభ్య పెడుతుండటంతో ప్రచారాల్లో పాల్గొంటున్నారు. తాజాగా దర్శి మండలం త్రిపురసుందరీపురంలో మంగళవారం రాత్రి వైకాపా తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి, సతీమణి నందిని, తల్లి జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడి వాలంటీర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం క్షేత్ర సహాయకుడు నాగభూషణం అందులో పాల్గొన్నారు. మరో వీఏవో కూడా ఇందులో పాల్గొని ప్రచారం చేసినట్లు సమాచారం.

ఓటర్ల వివరాలు సేకరిస్తూ..: దర్శి పట్టణంలో గత నాలుగు రోజులుగా కొందరు వాలంటీర్లు ఇంటింటా తిరిగి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. అందులోనూ రాత్రి వేళల్లో ఓటర్ల జాబితాలను తీసుకొని వారికి సంబంధించిన ఆధార్‌కార్డు గుర్తింపు సంఖ్యతోపాటు వారి ఖాతా నెంబర్ల వివరాలను  నమోదు చేసుకుంటున్నారు. కొందరు ఓటర్లు మాత్రం వివరాలు చెప్పకుండా తప్పు కుంటుండగా మరికొందరు మాత్రం ప్రభుత్వ పథకాలను కోల్పోతామన్న భయంతో తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎటు వైపునకు దారి తీస్తాయోనని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.


ప్రచారంలో చౌక డీలర్‌

ఒంగోలు : చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలేనికి చెందిన చౌక ధరల దుకాణం డీలరు ఎస్‌.విజయ్‌ భాస్కర్‌ రెడ్డి ఈ నెల 24న గ్రామంలో జరిగిన వైకాపా సభలో పాల్గొన్నాడంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. రేషన్‌ డీలరుగా ఉంటూ వైకాపా కార్యక్రమాల్లో పాల్గొని  ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు అందులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న అతనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని