logo

రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్‌లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్‌ చేయించాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆదేశించారు.

Published : 29 Mar 2024 01:55 IST

సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, డీఆర్వో శ్రీలత

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్‌లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్‌ చేయించాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆదేశించారు. ఈసీ ఆదేశాల మేరకు ఆయుధాల డిపాజిట్‌, ఇతర పేలుడు పదార్థాల స్వాధీనం తదితర అంశాలపై సంబంధిత జిల్లా అధికారులతో ఒంగోలు ప్రకాశం భవన్‌లోని ఛాంబర్‌లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కొత్తగా ఎలాంటి లైసెన్స్‌లు మంజూరు చేయరాదని స్పష్టం చేశారు. వ్యక్తిగత లైసెన్స్‌ ఆయుధాలను అందరూ తిరిగి డిపాజిట్‌ చేయాలన్నారు. లైసెన్స్‌దారులు మృతి చెందితే వారి వద్ద ఉన్న ఆయుధాల స్థితిగతులు, రాజకీయ నేపథ్యమున్న ఖైదీలు జైలులో నుంచి ప్రతివారం కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న కాల్‌ డేటా వివరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. జైలులోని ఖైదీల నేరచరిత్ర, రాజకీయ నేపథ్య వివరాలను కూడా సంబంధిత అధికారుల ద్వారా తీసుకుని వారి అనుచరుల కదలికలను గమనిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఆర్వో శ్రీలత, జిల్లా జైలు సూపరింటెండెంట్‌ వరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని