logo

అభివృద్ధికి శ్రీకారం... శ్రీకాకుళం

అభివృద్ధికి శ్రీకారం శ్రీకాకుళం అని సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మపథం కార్యక్రమంలో భాగంగా తనికెళ్ల భరణి స్నేహితుడు....

Published : 07 Dec 2021 06:07 IST


ప్రవచనాలు చెబుతున్న తనికెళ్ల భరణి

జలుమూరు, న్యూస్‌టుడే: అభివృద్ధికి శ్రీకారం శ్రీకాకుళం అని సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మపథం కార్యక్రమంలో భాగంగా తనికెళ్ల భరణి స్నేహితుడు కృష్ణారావు అధ్యక్షతన గ్రామ సర్పంచి తమ్మన్నగారి సతీష్‌ ఆధ్వర్యంలో సోమవారం ఆలయ ప్రాంగణంలో ప్రవచనాలు చెప్పారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘శ్రీ’ అంటే సంపద, సంపద ఇచ్చేవాడు శివుడు. శ్రీకాకుళంలో మొదటిఅక్షరం శ్రీతో ప్రారంభం కావడంతో సంపద కలిగిన జిల్లాగా చెప్పవచ్చన్నారు. సంపదనిచ్చేవాడు శివుడైతే, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు (సూర్యనారాయణమూర్తి) అని, వీరిద్దరినీ ప్రార్థించాలన్నారు. గతంలో తాను శ్రీముఖలింగం వచ్చినపుడు, ఇప్పటి పరిస్థితిని పరిశీలిస్తే జిల్లా ఎంతో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. అనంతరం ప్రవచనాలు చెప్పడంతో పాటు, పలు గేయాలను ఆలపించారు. ఎంపీటీసీ సభ్యుడు హరిప్రసాద్‌, ఈవో సూర్యనారాయణ, దేవాదాయశాఖ సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని