logo

సిక్కోలు నుంచి బస్సుయాత్రకు శ్రీకారం

వైకాపా ఆధ్యర్యంలో చేపట్టనున్న సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర జిల్లా నుంచి ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. గురువారం నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర కొనసాగనుంది.

Published : 26 May 2022 06:22 IST

హాజరుకానున్న 17 మంది మంత్రులు

అరసవల్లి, న్యూస్‌టుడే: వైకాపా ఆధ్యర్యంలో చేపట్టనున్న సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర జిల్లా నుంచి ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. గురువారం నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర కొనసాగనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు కార్యక్రమంలో పాల్గొని మూడేళ్లుగా ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని ఎలా అమలు చేస్తుందో వివరించనున్నారు. పలువురు మంత్రులు బుధవారం రాత్రే జిల్లాకు చేరుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 10 నుంచి 12 వేల వరకు వైకాపా శ్రేణులు కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. బస్సుయాత్రను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లపై నాయకులతో సమీక్షించి సూచనలు చేశారు.

పాల్గొననున్న మంత్రులు వీరే.....

ధర్మాన ప్రసాదరావు(రెవెన్యూ), బొత్స సత్యనారాయణ(విద్యాశాఖ), చెల్లుబోయిన వేణుగోపాల్‌(బీసీ, సంక్షేమం), సీదిరి అప్పలరాజు(మత్స్య), కె.నారాయణస్వామి(ఉప ముఖ్యమంత్రి), తానేటి వనిత(హోం), అంజాద్‌బాషా(మైనార్టీ వెల్ఫేర్‌), బి.రాజన్నదొర(ఉప ముఖ్యమంత్రి), బూడి ముత్యాలనాయుడు(ఉప ముఖ్యమంత్రి), పినిపె విశ్వరూప్‌(రవాణా), కారుమూరి వెంకట నాగేశ్వరరావు(పౌరసరఫరాలు), జోగి రమేష్‌(గృహనిర్మాణ), మేరుగ నాగార్జున(సాంఘిక సంక్షేమ), గుమ్మనూరు జయరాం(కార్మిక), ఆదిమూలపు సురేష్‌(పురపాలక), విడదల రజిని(వైద్య,ఆరోగ్య), ఉషశ్రీచరణ్‌(స్త్రీ సంక్షేమం).

యాత్ర సాగుతుందిలా...

ఉదయం 8 గంటలకు అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి వస్తారు. స్వామి దర్శనం అనంతరం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఏడురోడ్ల కూడలిలోని వైఎస్సార్‌ విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేస్తారు. 10 గంటలకు బస్సుయాత్రను ప్రారంభిస్తారు. 11 గంటలకు ఎచ్చెర్ల, 11.45 గంటలకు రణస్థలం మీదుగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

పటిష్టమైన బందోబస్తు

బస్సు యాత్ర నేపథ్యంలో పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను సిద్ధం చేసింది. దీనిపై ఎస్పీ రాధిక బుధవారం నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు ట్రయిల్‌రన్‌ వేశారు.

నగరానికి చేరుకున్న మంత్రులు రాజన్నదొర, ముత్యాలనాయుడు,

వనిత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని