logo

బదిలీల కోలాహలం!

జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో గురువారం బదిలీల కోలాహలం నెలకొంది. ఎంతో కాలం ఒకే చోట విధులు నిర్వర్తించిన పలువురు అధికారులకు స్థానచలనం కల్పించారు. అత్యధికంగా         రెవెన్యూశాఖ భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి.

Published : 02 Jun 2023 05:57 IST

జిల్లా ముఖ్య అగ్నిమాపక అధికారిగా మోహనరావు

జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో గురువారం బదిలీల కోలాహలం నెలకొంది. ఎంతో కాలం ఒకే చోట విధులు నిర్వర్తించిన పలువురు అధికారులకు స్థానచలనం కల్పించారు. అత్యధికంగా         రెవెన్యూశాఖ భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇతర శాఖల్లోనూ నూతన జిల్లా అధికారులను నియమించారు.

రెవెన్యూశాఖలో 91 మందికి స్థానచలనం

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లా రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. తహసీల్దార్‌ స్థాయి నుంచి గ్రామ రెవెన్యూ అధికారి వరకు 91 మందికి స్థానచలనం కల్పించారు. ఏడుగురు తహసీˆల్దార్లు, 40 మంది గ్రేడ్‌-1 వీఆర్‌వోలు, 14 మంది సీనియర్‌ సహాయకులు, ఆరుగురు జూనియర్‌ సహాయకులు, 18 మంది ఉప తహసీల్దార్లు, మరో ఆరుగురిని అంతర జిల్లాలకు బదిలీ చేస్తూ కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, జేసీ ఎం.నవీన్‌ ఉత్తర్వులిచ్చారు. బదిలీ అయిన వారిలో ముగ్గురిని డెప్యూటేషన్‌పై నియమించారు.

పొందూరు సబ్‌ రిజిస్ట్రార్‌గా శ్రీనివాసులు

పొందూరు, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేసిన శ్రీనివాసులు పొందూరు సబ్‌ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన కనకరత్నం విశాఖకు బదిలీ అయ్యారు.
శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: జిల్లా ముఖ్య అగ్నిమాపకాధికారిగా జడ్డు మోహనరావు నియమితులయ్యారు. ఈయన 1993లో విధుల్లో చేరారు. 2010 నుంచి 2013 మధ్యకాలంలో జిల్లా అదనపు అగ్నిమాపకాధికారిగా మోహనరావు శ్రీకాకుళంలోనే పని చేశారు. అనంతరం జిల్లా అగ్నిమాపకశాఖాధికారిగా ఉద్యోగోన్నతి పొంది విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఇక్కడ జిల్లా ముఖ్య అగ్నిమాపకాధికారిగా చేస్తున్న బి.వీరభద్రరావును పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రాష్ట్ర అగ్నిమాపకశాఖ శిక్షణ కేంద్రంలో అదనపు అగ్నిమాపకాధికారిగా నియమిస్తూ బదిలీ చేశారు.

ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈగా జాన్‌ సుధాకర్‌

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో రహదారులు, భవనాల శాఖ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌గా జాన్‌ సుధాకర్‌ను నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన విశాఖపట్నంలో ఎస్‌ఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఎస్‌ఈగా చేస్తున్న కె.కాంతిమతిని విశాఖపట్నానికి బదిలీ చేశారు.

దేవాదాయశాఖ ఏసీగా చంద్రశేఖర్‌

శ్రీకాకుళం సాంస్కృతికం న్యూస్‌టుడే: జిల్లా దేవాదాయశాఖలో పలువురు ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. జిల్లా సహాయ కమిషనరుగా ఎస్‌.చంద్రశేఖర్‌ని నియమిస్తూ ఆ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  ఈయన అనకాపల్లి నూకాంబిక దేవాలయం ఏసీగా పని చేశారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం పర్యవేక్షకులుగా పని చేసిన కె.వెంకటేశ్వరరావును సింహాచలం దేవస్థానానికి, జూనియర్‌ సహాయకులు వై.శ్యామ్‌ను విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయానికి బదిలీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని