logo

ఏనుగు దాడిలో అటవీశాఖ ఉద్యోగి మృతి

ఏనుగు దాడిలో అటవీశాఖ ఒప్పంద ఉద్యోగి మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కోయంబత్తూరు జిల్లా పశ్చిమ కనుమల దిగువన కొన్ని గిరిజన గ్రామాలున్నాయి. ఇవి కేరళ అటవీ ప్రాంతాన్ని ఆనుకొని

Updated : 13 Aug 2022 06:58 IST

మురుగన్‌ (పాతచిత్రం)

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ఏనుగు దాడిలో అటవీశాఖ ఒప్పంద ఉద్యోగి మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కోయంబత్తూరు జిల్లా పశ్చిమ కనుమల దిగువన కొన్ని గిరిజన గ్రామాలున్నాయి. ఇవి కేరళ అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉండడంతో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సీంగప్పతి గ్రామానికి చెందిన అటవీశాఖ ఒప్పంద ఉద్యోగి మురుగన్‌ శుక్రవారం ఉదయం కుట్రాలం రోడ్డులో వెళ్తుండగా ఉన్నట్టుండి పొదల్లో నుంచి వచ్చిన ఏనుగు అతనిపై దాడిచేసింది. ఘటనలో తీవ్రగాయాలైన అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.


నీళ్ల బకెట్‌లోపడి శిశువు...

చెన్నై (క్రైం), న్యూస్‌టుడే: ఆటాడుకుంటూ నీళ్ల బకెట్‌లో పడి ఓ శిశువు మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు... చెన్నై కేకేనగం్కు చెందిన అన్సారి, జెస్సీమా దంపతులు. వీరికి ఎనిమిది నెలల శిశువు సనా జాస్మిన్‌ ఉంది. గురువారం సాయంత్రం తల్లి వంట గదిలో ఉండగా శిశువు వేరే గదిలో ఆటాడుకుంటోంది. తర్వాత తల్లి వచ్చి చూడగా బిడ్డ అక్కడ కనిపించలేదు. వెతుకుతుండగా మరుగుదొడ్డిలోని నీళ్ల బకెట్‌లో తలకిందులుగా పడి ఉంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.


అనుమానాస్పదంగా వ్యక్తి...

ప్యారిస్‌, న్యూస్‌టుడే: అల్పాహారం తిని టీ తాగిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌పేటకు చెందిన ప్రభు (36) ఉళుందూర్‌ మున్సిపాలిటీలో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఇతను ఓ దుకాణంలో అల్పాహారం తిని, టీ తాగాడు. రాత్రి అతనికి అకస్మాత్తుగా శ్వాస సమస్య తలెత్తింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని