logo

చిన్నారులతో కత్రినా కైఫ్‌ నృత్యం

బాలీవుడ్‌ అందాల తార కత్రినా కైఫ్‌ చిన్నారులతో కలిసి స్టెప్పులు వేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలయింది. ఆంగ్ల మాధ్యమ విద్య అందించడం కోసం 2015లో మదురైలో మౌంటెన్‌ వ్యూ పాఠశాల ఏర్పాటైంది. దీనిని తన ట్రస్టు ద్వారా కత్రినా కైఫ్‌ తల్లి

Published : 27 Sep 2022 01:24 IST

చెన్నై, న్యూస్‌టుడే: బాలీవుడ్‌ అందాల తార కత్రినా కైఫ్‌ చిన్నారులతో కలిసి స్టెప్పులు వేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలయింది. ఆంగ్ల మాధ్యమ విద్య అందించడం కోసం 2015లో మదురైలో మౌంటెన్‌ వ్యూ పాఠశాల ఏర్పాటైంది. దీనిని తన ట్రస్టు ద్వారా కత్రినా కైఫ్‌ తల్లి చాలా కాలం నిర్వహించారు. ఈ పాఠశాల ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో కత్రినా కైఫ్‌ పాల్గొన్నారు. పిల్లలతో కలిసి ‘బీస్ట్‌’ చిత్రంలోని అరబిక్‌ కుత్తు పాటకు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని