logo

రాజ్యాంగంపై అవగాహన అవసరం

రాజ్యాంగంపై కళాశాల విద్యార్థులందరు అవగాహన కలిగి ఉండటం అవసరమని జిల్లా మాజీ న్యాయమూర్తి కిల్లివలవన్‌ సూచించారు.

Published : 28 Nov 2022 01:10 IST

ఆవడి, న్యూస్‌టుడే: రాజ్యాంగంపై కళాశాల విద్యార్థులందరు అవగాహన కలిగి ఉండటం అవసరమని జిల్లా మాజీ న్యాయమూర్తి కిల్లివలవన్‌ సూచించారు. ఆవడి సమీపం పట్టాభిరామ్‌లో ఉన్న ధర్మమూర్తి రావు బహదూర్‌ కలవల కన్నన్‌శెట్టి హిందూ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. కిల్లివలవన్‌ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ... ప్రజలందరు రాజ్యాంగాన్ని అనుసరించాలన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు ఆయన ధ్రువపత్రం, ట్రోఫీలను అందించి, అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్‌ కల్వికక్కరసి, న్యాయశాఖ సంచాలకుడు రాజేంద్రనాయుడులు అతిథిని సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని