logo

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: ఎడప్పాడి

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు.

Published : 01 Dec 2022 00:45 IST

నామఫలకాలను ఆవిష్కరిస్తున్న పళనిస్వామి

సేలం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. సేలం జిల్లా ఎడప్పాడిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే హయాంలో శాంతిభత్రలు చక్కగా నిర్వహించామని, శాంతిభద్రతల నిర్వహణలో ఉత్తమ రాష్ట్రంగా తమిళనాడు ఎంపికై అవార్డు కూడా అందుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 36 గంటల్లో 15 హత్యలు జరుగుతున్నాయన్నారు. అనంతరం ఎడప్పాడి పంచాయతీ యూనియన్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూ.2.46 కోట్ల వ్యయంతో చేపట్టిన 25 పథకాలకు శంకుస్థాపన చేశారు. రూ.58.70 లక్షల వ్యయంతో చేపట్టి ముగిసిన 8 పథకాలను ప్రారంభించారు. సైదాపేట, న్యూస్‌టుడే: డీఎంకే పాలనలో రాష్ట్రం మాదకద్రవ్యాల స్థావరంగా మారుతోందని ఓ ప్రకటనలో ఆరోపించారు. రామనాథపురం జిల్లా వేదాలై వద్ద రూ.360 కోట్ల విలువైన ద్రవ కొకైన్‌ పట్టుబడినట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. ఈ ఘటనలో కీళక్కరై పంచాయతీ 19 వార్డు డీఎంకే కౌన్సిలర్‌ సర్ఫరాజ్‌, మాజీ కౌన్సిలర్‌ జయనుద్దీన్‌లు అరెస్టయ్యారన్నారు. దీని వెనుక పెద్ద నేతలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని