logo

సామాజిక సేవలో పాఠశాల విద్యార్థులు

ధర్మపురి జిల్లా పాడి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ‘ఫీనిక్స్‌’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.

Published : 24 Mar 2023 00:25 IST

పక్షులకు ఆహారం, నీరు పెడుతున్న దృశ్యం

విల్లివాక్కం: ధర్మపురి జిల్లా పాడి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ‘ఫీనిక్స్‌’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా పూకానహల్లి గ్రామంలోని చెరువులు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులతో పాటు పలు ప్రాంతాలలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. వివిధ కార్యక్రమాలను పురస్కరించుకుని గత 4 ఏళ్లలో సుమారు 5 వేల మొక్కలకు పైగా నాటారు. ఈ నేపథ్యంలో వేసవి ప్రారంభమైనందున గ్రామంలోని చెరువులు, బావుల్లో ప్రజల భాగస్వామ్యంతో పూడికతీత పనులు చేపట్టారు. పక్షులకు డబ్బాల్లో గింజలు, నీరు నింపి చెట్లకు వేలాడదీస్తున్నారు. వీరి సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు