logo

ప్రభుత్వ హోంలలో భద్రతా చర్యలు

ప్రభుత్వ హోం నుంచి బాలలు తప్పించుకోని విధంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి గీతాజీవన్‌ తెలిపారు.

Updated : 30 Mar 2023 06:13 IST

మాట్లాడుతున్న మంత్రి గీతాజీవన్‌

వేలూర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ హోం నుంచి బాలలు తప్పించుకోని విధంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి గీతాజీవన్‌ తెలిపారు. వేలూర్‌ కలెక్టరు కార్యాలయం వద్ద సామాజిక భద్రతా శాఖ కింద నడుస్తున్న ప్రభుత్వ హోం నుంచి ఈనెల 27న ఆరుగురు బాలురు పారిపోయారు. ఇందుకు సంబంధించి మంత్రి గీతాజీవన్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశం  నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పారిపోయిన ఆరుగురిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని