బాణసంచా గోదాములో పేలుడు..ముగ్గురి దుర్మరణం
బాణసంచా గోదాములో పేలుడు సంభవించి ముగ్గురు మృతిచెందిన ఘటన సేలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... సేలం జిల్లా సర్కార్ కొల్లప్పట్టి సెంగనూర్‌కి చెందిన సతీష్‌కుమార్ (41) స్థానికంగా బాణసంచా గోదాము నిర్వహిస్తున్నాడు.
ఘటనాస్థలిలో పరిశీలిస్తున్న పోలీసులు
సేలం, న్యూస్‌టుడే: బాణసంచా గోదాములో పేలుడు సంభవించి ముగ్గురు మృతిచెందిన ఘటన సేలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... సేలం జిల్లా సర్కార్ కొల్లప్పట్టి సెంగనూర్‌కి చెందిన సతీష్‌కుమార్ (41) స్థానికంగా బాణసంచా గోదాము నిర్వహిస్తున్నాడు. ఇందులో పది మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం అందరూ పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో ఉన్నట్టుండి పేలుడు సంభవించింది. ప్రమాదంలో గోదాము నేలమట్టమైంది. శిథిలాల కింద చిక్కుకుని యజమాని సతీష్‌కుమార్, కార్మికులు నటేశన్ (50), 40 ఏళ్ల మహిళ ఘటనాస్థలిలోనే మృతిచెందారు. మోహన, మణిమేఘలై తదితర ఆరుగురు 50 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసు కమిషనరు విజయకుమారి, డిప్యూటీ కమిషనరు గౌతమ్ గోయల్ ఘటనాస్థలిని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత