logo

తమిళ సంస్కృతికి వ్యతిరేకంగా గవర్నరు చర్యలు

తమిళ సంస్కృతి, రాష్ట్రప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా గవర్నర్‌ మాట్లాడుతున్నారని టీఎన్‌సీసీˆ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి ఆరోపించారు.

Published : 07 Jun 2023 00:59 IST

టీఎన్‌సీసీ అధ్యక్షుడి ఆరోపణ

వేలచ్చేరి, న్యూస్‌టుడే: తమిళ సంస్కృతి, రాష్ట్రప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా గవర్నర్‌ మాట్లాడుతున్నారని టీఎన్‌సీసీˆ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి ఆరోపించారు. మంగళవారం ఆయన కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ..గవర్నరు ఆర్‌ఎన్‌ రవి నిరంతరం హద్దులు దాటి మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ పెట్టుబడుల కోసం విదేశాలకు వెళితే గవర్నరు విమర్శించడం తగదన్నారు. ముఖ్యమంత్రి అడిగితే పెట్టుబడులు రావని పేర్కొనడం తగదని చెప్పారు. రాష్ట్రంలో విద్య సక్రమంగా లేదని గవర్నరు అంటున్నారని, ఇది కూడా సబబు కాదన్నారు. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లని పెట్టుబడులు తమిళనాడుకు వస్తున్నాయంటే ఇక్కడ సాంకేతికత, మూల ధనం, మానవ వనరులు ఎక్కువగా ఉన్నట్లేనని పేర్కొన్నారు. అందుకే పెట్టబడులను ఆకర్షించే పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందన్నారు. నరేంద్ర మోదీ వచ్చాకే దేశం అభివృద్ధి చెందిందని గవర్నర్‌ పేర్కొన్నట్లు గుర్తుచేశారు. నిజంగా పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ల హయాంలోనే ప్రగతి సాధించినట్లు తెలిపారు. ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి పడిపోయిందన్నారు.

చెన్నైలోని పలు ప్రాంతాల్లో వర్షం

ప్యారిస్‌, న్యూస్‌టుడే: చెన్నై నగరంలో మంగళవారం పలు చోట్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా మంగళ, బుధవారాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్‌లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురిసింది. చెన్నై సెంట్రల్‌, పురసైవాక్కం, ఎగ్మూర్‌, నుంగంబాక్కం, కోడంబాక్కంలలో పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని