logo

Vijay: మీ కాలు చెప్పులా ఉండటానికీ వెనుకాడను: హీరో విజయ్‌

‘దయచేసి ఓపిక పట్టండి. మన లక్ష్యం ఇది కాదు. వేరే ఉంది. అది గొప్పది. ఆ దిశగా అడుగులేద్దాం. భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం’ అంటూ నటుడు విజయ్‌ తన అభిమానులను ఉద్దేశించి చెప్పారు.

Updated : 03 Nov 2023 07:36 IST

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న విజయ్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ‘దయచేసి ఓపిక పట్టండి. మన లక్ష్యం ఇది కాదు. వేరే ఉంది. అది గొప్పది. ఆ దిశగా అడుగులేద్దాం. భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం’ అంటూ నటుడు విజయ్‌ తన అభిమానులను ఉద్దేశించి చెప్పారు. లోకేష కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించిన కొత్త చిత్రం ‘లియో’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ‘లియో’ విజయోత్సవ వేడుక బుధవారం రాత్రి నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు. దాదాపు 10వేల మందికి పైగా అభిమానులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చారు. కార్యక్రమంలో భాగంగా విజయ్‌ మాట్లాడుతూ.. ‘నాపై ఇంత అభిమానం ఉంచుకున్న మీకు ఏదైనా తప్పకుండా చేయాలనుంది. చేస్తా. మీ కాలు చెప్పులా ఉండటానికి కూడా వెనుకాడను. ఇప్పుడేం జరిగినా పట్టించుకోకండా అందరూ ఓపిక పట్టండి. విజయాన్ని అందుకోవచ్చు అన్నారు. అలాగే ఓ పిట్టకథ చెబుతూ.. ‘ఇద్దరు వేటగాళ్లు అడవిలోకి వెళ్లారు. ఒకడు తన వద్ద ఉన్న బాణంతో కుందేలును గురుచూసి పట్టుకున్నాడు. ఇంకొకడు ఏనుగును లక్ష్యంగా చేసుకుని తన వద్ద ఉన్న ఆయుధాన్ని విసిరాడు. గురితప్పింది. ఉత్తచేతులతో ఇంటికి తిరిగొచ్చారు. నా దృష్టిలో కుందేలును పట్టుకున్న వ్యక్తి విజయం సాధించినట్టు కాదు. ఏనుగులాంటి పెద్ద లక్ష్యాన్ని ఛేదించాలని అనుకున్న వ్యక్తే గొప్పవాడు. అతను ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పొందుతాడంటూ’ కథ వినిపించాడు. ఇది రజనీకాంత్‌ను పరోక్షంగా విమర్శించినట్లేనని సినీవర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని