logo

88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం

కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు.

Published : 28 Mar 2024 00:21 IST

ఆంధ్ర యువకుడి అరెస్టు

సతీష్‌రెడ్డి

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంచీపురం విలక్కొలి పెరుమాళ్‌ ఆలయం వీధిలో నివాసం ఉంటున్న రాజేష్‌ ఇంట్లో గతనెల 16న 15 సవర్ల నగలు చోరీకి గురైయ్యాయని తెలిపారు. అదే వీధిలో నివాసం ఉంటున్న మహావీర్‌ జైన్‌ తన ఇంటికి తాళం వేసి బయటి ఊరికి వెళ్లగా ఈనెల మొదట్లో దొంగలు 180 సవర్ల బంగారు ఆభరణాలు తీసుకెళ్లిపోయారని తెలిపారు. ఈ రెండు కేసులకు సంబంధించి విష్ణు కంచి పోలీసులు కేసు నమోదు చేసి వేలిముద్రలు సేకరించి నగరంలోని 200 సీసీటీవీల పుటేజీలు పరిశీలించారని పేర్కొన్నారు. చోరీలకు పాల్పడింది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం బాబూజీ కాలనీకి చెందిన కరి అలియాస్‌ సతీష్‌రెడ్డి(40) గుర్తించారు. ప్రత్యేకబృందం ఇన్‌స్పెక్టర్లు వెట్రిసెల్వన్‌, శంకర సుబ్రమణియన్‌ చిత్ర తదితరులు విశాఖపట్నం చేరుకొని అక్కడి పోలీసులు సాయంతో అరెస్టు చేసి కాంచీపురానికి మంగళవారం సాయంత్రం తీసుకొచ్చారని తెలిపారు. 88 సవర్ల నగలు, రూ.36 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నామని సతీష్‌రెడ్డిపై 80 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని