logo

మూడో ప్రయత్నంలో 871వ ర్యాంకు

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో పీఎఫ్‌ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఇన్బ 851వ ర్యాంకు సాధించారు. ఆమె మాట్లాడుతూ.. నా సొంతూరు తెన్‌కాశి జిల్లా వాసుదేవనల్లూర్‌.

Published : 18 Apr 2024 01:10 IST

సివిల్స్‌లో పీఎఫ్‌ కార్యాలయ సహాయ ఉద్యోగిని ప్రతిభ

ఇన్బ

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో పీఎఫ్‌ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఇన్బ 851వ ర్యాంకు సాధించారు. ఆమె మాట్లాడుతూ.. నా సొంతూరు తెన్‌కాశి జిల్లా వాసుదేవనల్లూర్‌. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివాను. 11, 12 తరగతుల కోసం సెంగోట్టై వచ్చేశాం. కోవై సీఐటీ టెక్నాలజీ కళాశాలలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదివాను. పూర్తయ్యక సివిల్స్‌ కోసం చెన్నైలో శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీలో చేరి ఏడాది శిక్షణ పొందాను. రెండుసార్లు అర్హత అందుకోలేకపోయాను. అనంతరం ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కోవై జోనల్‌ పీఎఫ్‌ కార్యాలయంలో సహాయకుడి ఉద్యోగం లభించింది. ఎలాగైనా సివిల్స్‌ నెగ్గాలని చెన్నైలో ప్రభుత్వ సివిల్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. మూడో ప్రయత్నంలో 851వ ర్యాంకు వచ్చింది. తండ్రి కోవైలో బస్సు కండక్టరు. అమ్మ బీడి కార్మికురాలు. కుటుంబాన్ని పేదరికం నుంచి బయట పడేయాలని పట్టుదలతో చదివాను. నమూనా ప్రశ్నలు సాధన చేశానని, జనరల్‌ నాలెడ్జి పెంపొందించుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని