logo

నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

సముద్రంలో 1.8 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడుతుండటంతో కన్నియాకుమరి, తూత్తుక్కుడి, తిరునెల్వేలి, రామనాథపురం జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

Published : 05 May 2024 00:09 IST

సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: సముద్రంలో 1.8 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడుతుండటంతో కన్నియాకుమరి, తూత్తుక్కుడి, తిరునెల్వేలి, రామనాథపురం జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. తమిళనాడు సముద్రతీర ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ పరిశోధన కేంద్రం, జాతీయ సముద్ర సమాచార సేవా కేంద్రం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఆదివారం రాత్రి వరకు సముద్రం కల్లోలంగా ఉంటుందని, అలలు పెద్ద ఎత్తున ఎగిసి పడతాయని తెలిపాయి. కావున ప్రజలు సముద్ర తీరాలకు వెళ్లొద్దని హెచ్చరించింది. కన్నియాకుమరి, తూత్తుక్కుడి, తిరునెల్వేలి, రామనాథపురం తదితర సముద్రతీర ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌, చెన్నై పుదుచ్చేరి, కడలూరు సముద్రతీరాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ అయింది. జాలర్లు చేపల వేటకు సముద్రంపైకి వెళ్లకూదని, పడవలను సురక్షితం ప్రాంతాల్లో నిలపాలని, తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని