logo

AP News:పక్షవాతంతో ఆసుపత్రికి వెళ్తే.. పట్టానే మార్చేశారు

అనారోగ్యానికి గురై గ్రామం విడిచి  ఆసుపత్రికి వెళ్తే ఆన్‌లైనులో భూమిని మరొకరికి మార్చేసిన సంఘటన దొప్పెర్లలో సోమవారం వెలుగుచూసింది. ముచ్చు రామునాయుడుకి సర్వే నంబర్‌ 209-సబ్‌ డివిజన్‌ 2/30లో 31 సెంట్ల

Published : 11 Jan 2022 09:26 IST

ఫిర్యాదు కాపీని చూపిస్తున్న దొప్పెర్లకు చెందిన ముచ్చు రామునాయుడు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అనారోగ్యానికి గురై గ్రామం విడిచి ఆసుపత్రికి వెళ్తే ఆన్‌లైనులో భూమిని మరొకరికి మార్చేసిన సంఘటన విశాఖ జిల్లా దొప్పెర్లలో సోమవారం వెలుగుచూసింది. ముచ్చు రామునాయుడుకి సర్వే నంబర్‌ 209-సబ్‌ డివిజన్‌ 2/30లో 31 సెంట్ల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు దీనికి 1995లో పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేశారు. గత ఏడాది పక్షవాతానికి గురైన రామునాయుడు గ్రామం విడిచి గాజువాక ఆసుప్రతికి వెళ్లగా దీనిని అవకాశంగా మార్చుకున్న కొందరు దీనిని ఆన్‌లైన్‌లో భూ యజమాని పేరు మార్చేశారు. ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చిన రామునాయుడు ఈ విషయం తెలిసి లబోదిబోమంటూ అనకాపల్లి ఆర్‌డీఓ, అచ్యుతాపురం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై తహసీల్దార్‌ రాంబాయిని వివరణ కోరగా బాధితుడు దీనిపై ఆర్డీఓ కోర్టులో కేసు వేయాల్సి ఉంటుందన్నారు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని