Updated : 25 Jan 2022 10:06 IST
AP News: నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం
నర్సీపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. గంజాయి తరలిస్తున్నారనే అనుమానంతో ముఠా కారును ట్రాఫిక్ ఎస్సై, పోలీసులు గుర్తించి వారిని వెంబడించారు. తప్పించుకునే క్రమంలో గంజాయి ముఠా కారు ఓ ఆటోని ఢీకొట్టింది. అనంతరం పోలీసులు వెంబడిస్తుండటంతో కొంతదూరం వెళ్లాక కారును విడిచిపెట్టేశారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులు సమీపంలోని పెదబొడ్డేపల్లి పెద్ద చెరువులో దూకేయగా.. మరో నిందితుడి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు చెరువును చుట్టుముట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టడంతో అతడు చిక్కాడు. నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల కారులో భారీగా గంజాయి ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
Tags :