logo

ఆకట్టుకున్న ఆయుధ బలం

ఎన్‌ఎస్‌టీఎల్‌ (నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజికల్‌ లేబొరేటరీ- నావిక సమరశాస్త్ర సాంకేతిక ప్రయోగశాల)లో ‘ఎలక్ట్రో కెమికల్‌ ఎనర్జీ కన్వర్షన్‌ అండ్‌ స్టోరేజ్‌-2022(ఈకోస్‌-2022)’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ సదస్సు

Updated : 29 Sep 2022 06:23 IST

ఎన్‌ఎస్‌టీఎల్‌లో నమూనాల ప్రదర్శన

ఎన్‌ఏడీకూడలి, న్యూస్‌టుడే: ఎన్‌ఎస్‌టీఎల్‌ (నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజికల్‌ లేబొరేటరీ- నావిక సమరశాస్త్ర సాంకేతిక ప్రయోగశాల)లో ‘ఎలక్ట్రో కెమికల్‌ ఎనర్జీ కన్వర్షన్‌ అండ్‌ స్టోరేజ్‌-2022(ఈకోస్‌-2022)’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సముద్రం అడుగు భాగంలో వినియోగించే వాహనాల బ్యాటరీలతో సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో ఎన్‌ఎస్‌టీఎల్‌తో పాటు, హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌, హెచ్‌ఈబీ ఇండియా లిమిటెడ్‌, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, బ్రై-ఎయిర్‌, రాస్‌ ప్రాసెస్‌ ఎక్విప్‌మెంట్స్‌, సెమ్యూంగ్‌ ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌, జితేంద్ర ఈవీ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర సంస్థకు చెందిన నమూనాలను ప్రదర్శనగా ఉంచారు. వాటిల్లో కొన్నింటి పనితీరు ఇలా..

వరుణాస్త్ర: ఇది అత్యంత శక్తివంతమైన టార్బిటల్‌. శత్రుదేశాలపై యుద్ధంలో ఉపయోగిస్తారు.

అల్యూమినియం సిల్వర్‌ ఆక్సైడ్‌ 120 కేడబ్ల్యూ బ్యాటరీ.. బయట వాతావరణంలో పొడిగా ఉంటుంది. సముద్రంలోకి తీసుకెళ్లి వినియోగించగానే బ్యాటరీ పని చేయడం ప్రారంభించి... విద్యుత్తు సరఫరాను అందిస్తుంది. దీన్ని తేలికపాటి టార్పిడోలో వినియోగిస్తారు.

హై ఇండూరన్స్‌ అండ్‌ వాటర్‌ వెహికల్‌ బ్యాటరీ: జలాంతర్గాములు, బోట్లలో సముద్రంలో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యలో శత్రుదేశాలు ఏదైనా ప్రమాదకర పేలుడు పదార్థాలు ఉంచితే... ఈ బ్యాటరీలు ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి, ముప్పును తప్పిస్తాయి.

హెవీ వెయిట్‌ టార్బిటల్‌ బ్యాటరీ: దీన్ని వినియోగంతో నీటి అడుగుభాగంలోటార్బిటల్‌ ప్రయాణ వేగం పెరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని