logo

గంజాయి తరలిస్తున్న కారుకు ప్రమాదం.. స్మగ్లర్లు పరారీ

అక్రమంగా గంజాయి తరలిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన విశాఖ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో చోటుచేసుకుంది. 

Updated : 09 Feb 2023 15:03 IST

అనంతగిరి (విశాఖ): అక్రమంగా గంజాయి తరలిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన విశాఖ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో చోటుచేసుకుంది. అనంతగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం అరకులోయ ప్రాంతంన ఉంచి మైదాన ప్రాంతానికి వెళ్తున్న ఓ కారు హెయిర్‌పిన్‌ బ్యాండ్‌ 8 సమీపంలో రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కారులో ఉన్న గంజాయి మూటలు చెల్లాచెదురుగా బయటకు పడ్డాయి. అనంతరం గంజాయి స్మగ్లర్లు కారును విడిచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న అనంతగిరి ఎస్సై రాము తమ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని