logo

‘పోలవరం ఎత్తు తగ్గింపు యోచన తగదు’

రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ఆలోచన విరమించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ కోరారు.

Published : 28 Mar 2023 04:16 IST

కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ఆలోచన విరమించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ కోరారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద సీసీఐ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం పూర్తి చేయడానికి చర్యలు తీసుకోక పోవడం సిగ్గుచేటన్నారు. ప్రాజెక్టు ఎత్తును 135 అడుగులకు తగ్గించి నీటినిల్వ 92 టీఎంసీలకు పరిమితం చేయడం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఘోరంగా దెబ్బతింటాయన్నారు. ముఖ్యమంత్రి పోలవరంపై నోరు మెదపకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ఎత్తు తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. అనంతరం కలెక్టర్‌, జేసీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు రాజాన దొరబాబు, మాకిరెడ్డి రామునాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని