logo

ఉత్తరం నుంచి మూడోసారి..

తెదేపా, జనసేన, భాజపా కూటమి త్రిముఖ వ్యూహంతో అభ్యర్థులను బరిలో నిలుపుతోంది.

Updated : 28 Mar 2024 04:32 IST

కూటమిలో భాజపా అభ్యర్థిగా విష్ణుకుమార్‌రాజు

ఈనాడు-విశాఖపట్నం, మాధవధార, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి త్రిముఖ వ్యూహంతో అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. విశాఖ ఉత్తరం నియోజవర్గ భాజపా అభ్యర్థిగా పి.విష్ణుకుమార్‌రాజును అధికారికంగా ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఏపీలో జగన్‌ పాలన తీరును వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి భాజపా నుంచి విష్ణుకుమార్‌రాజు. ఆ పార్టీ అంతర్గత సమావేశంలºనూ మూడు పార్టీల పొత్తు రాష్ట్రానికి అవసరమని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార పార్టీ బిల్లులు నిలిపివేసి ఇబ్బందులు పెట్టినా, వెనక్కి తగ్గకుండా భాజపాలో కొనసాగారు. కూటమి అభ్యర్థిగా ప్రస్తుతం బరిలో దిగుతున్నారు. 2014 ఎన్నికల్లో ఉత్తరం నుంచి పోటీచేయగా 82,079 (51.34%) ఓట్లు పోలయ్యాయి. 11.51% ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లోనూ భాజపా తరపున పోటీ చేయగా 18,790 ఓట్లు దక్కాయి. ఆ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా మూడు పార్టీలకు కలిపి 59శాతంపైగా ఓట్లు పోలయ్యాయి. ఈ సారి ఎన్నికల్లో కూటమి మంత్రంతో పోటీకి దిగుతున్నారు. నియోజకవర్గంలో దొంగ ఓట్లపై మొదటి నుంచి పోరాడుతూ, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. నియోజకవర్గంలో ప్రచారం విషయంలో ముందంజలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని