logo

‘నైపుణ్య’ భారతంలో ‘బంగరు’ యువత

ప్రతిభకు సానబెట్టారు.. బంగరు విజేతలై నిలిచారు. విశాఖ నగరంలోని పదకొండు వేదికలపై.. ‘ఇండియా స్కిల్స్‌-2021’ పోటీలు శనివారం ముగిశాయి. ఇందులో నైపుణ్యం చూపిన వారు పతకాలు అందుకుని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

Published : 05 Dec 2021 05:17 IST

న్యూస్‌టుడే, విశాఖపట్నం : ప్రతిభకు సానబెట్టారు.. బంగరు విజేతలై నిలిచారు. విశాఖ నగరంలోని పదకొండు వేదికలపై.. ‘ఇండియా స్కిల్స్‌-2021’ పోటీలు శనివారం ముగిశాయి. ఇందులో నైపుణ్యం చూపిన వారు పతకాలు అందుకుని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బంగారు పతక విజేతలకు రూ.21 వేలు, వెండి పతక విజేతలకు రూ.11వేల చొప్పున నగదు బహమతి అందించారు. ఈ సందర్భంగా బంగారు పతకాలు సాధించిన పలువురు యువత ఈ విజయం వెనుక వారి కృషి.. భవిష్యత్తు లక్ష్యాలను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.

ఆసక్తే నన్ను ఎంపిక చేసింది

పేరు : కె.లావణ్య సాయికుమార్‌

విభాగం : మొబైల్‌ అప్లికేషన్స్‌ డెవలప్‌మెంట్‌

ఊరు : పాత డెయిరీ ఫారం, విశాఖపట్నం

విజయనగరం ఎం.వి.జి.ఆర్‌. కళాశాలలో సి.ఎస్‌.ఇ.లో ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. మొబైల్‌ రిపేరింగ్‌మీద ఆసక్తి ఉండటంతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వారు శిక్షణ ఇచ్చారు. స్వర్ణపతకం సాధించడం ఆనందంగా ఉంది.

విజేతనవుతా..

పేరు : ఆర్‌.శ్రీహరి

విభాగం : సైబర్‌ సెక్యూరిటీ

ఊరు : బాడంగి, విజయనగరం జిల్లా

 ప్రాంతీయ స్థాయిలో విజేతగా నిలవడం ఆనందంగా ఉంది. దీన్ని మరింత సాధనచేసి జాతీయ స్థాయిలోనూ విజేతగా నిలవాలన్నది నా అభిలాష.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని