logo

ధర చిక్కింది.. ఆవేదన మిగిలింది

జిల్లాలో అతిపెద్దదైన రామభద్రపురం కూరగాయల మార్కెట్లో కాటాబంజి చిక్కుడు కాయల ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల మొదటి వారంలో కిలో చిక్కుడు కాయల ధర రూ.60 పలికింది. ప్రస్తుతం మార్కెట్‌ పరిధిలో కిలో రూ.10కు పడిపోవడంతో పెట్టుబడులు

Published : 26 Jan 2022 06:22 IST

రామభద్రపురం మార్కెట్లో చిక్కుడు అమ్మకాలు

రామభద్రపురం, న్యూస్‌టుడే: జిల్లాలో అతిపెద్దదైన రామభద్రపురం కూరగాయల మార్కెట్లో కాటాబంజి చిక్కుడు కాయల ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల మొదటి వారంలో కిలో చిక్కుడు కాయల ధర రూ.60 పలికింది. ప్రస్తుతం మార్కెట్‌ పరిధిలో కిలో రూ.10కు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రాలేదని అన్నదాతలు వాపోతున్నారు. ఇక్కడ వ్యాపారులంతా సిండికేట్‌ అవుతున్నారని ఆరోపిస్తున్నారు. రామభద్రపురం గ్రామానికి చెందిన రైతు శ్రీను మాట్లాడుతూ.. కొనుగోలుకు వ్యాపారులెవరూ ముందుకు రావడం లేదని, ఎకరా సాగుకు రూ.40 వేల మదుపు పెడితే కనీసం రూ.20 వేలు కూడా రాలేదన్నారు.

శ్రీను, రైతు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని