logo

అక్రమంగా తోడేస్తున్నారు

అనుమతులు అవసరం లేదు.. కావాల్సినంత మట్టిని కాజేయొచ్చు.. అడిగిన గ్రామ పెద్దలకు కాస్తో కూస్తో సమర్పిస్తే పనికి అడ్డుపడరు.. అని భావించారో ఏమో కానీ వారం రోజులుగా మెంటాడ మండలం కొంపంగి గ్రామానికి చెందిన గోపీనాథపట్నాయక్‌ చెరువులో మట్టిని అక్రమంగా తోడేస్తున్నారు.

Published : 28 Mar 2024 04:40 IST

గోపీనాథపట్నాయకుని చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు

గజపతినగరం(మెంటాడ), న్యూస్‌టుడే: అనుమతులు అవసరం లేదు.. కావాల్సినంత మట్టిని కాజేయొచ్చు.. అడిగిన గ్రామ పెద్దలకు కాస్తో కూస్తో సమర్పిస్తే పనికి అడ్డుపడరు.. అని భావించారో ఏమో కానీ వారం రోజులుగా మెంటాడ మండలం కొంపంగి గ్రామానికి చెందిన గోపీనాథపట్నాయక్‌ చెరువులో మట్టిని అక్రమంగా తోడేస్తున్నారు. జేసీబీలు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లు తిరుగుతున్నా.. స్థానికంగా ఉన్న, మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తెలిసీ ఊరుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులు గ్రామంలో కొందరికి తాయిలాలు అందించి, మట్టిని తవ్వుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

చెరువులో మట్టిని తరలించి.. పక్కన ఉన్న పొలాలను ఎత్తు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఇరిగేషన్‌ అధికారుల సూచనల మేరకు చెరువుల్లో మట్టిని తీయాలి. చెరువు లోతైతే నీరు దిగువ భాగంలో ఉండిపోయి, మదుములకు అందని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో ఆయకట్టులో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని స్థానిక వీఆర్వో మురళి వద్ద ప్రస్తావించగా.. తవ్వకాల గురించి తనకు తెలియదని, వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని