logo

అప్పులు కట్టలేక ఉపాధి పనికి సర్పంచి

గ్రామాభివృద్ధికి చేసిన అప్పులు తీర్చలేక.. ఇల్లు గడవడం కష్టంగా మారడంతో ఆ గ్రామ సర్పంచి ఉపాధిహామీ పథకంలో కూలీ పనికి వెళ్తున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్త గ్రామ పంచాయతీ విశ్వనాథకాలనీకి సర్పంచిగా వల్లెపు

Published : 24 May 2022 04:01 IST


మట్టి మోస్తున్న సర్పంచి వల్లెపు అనిత

భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: గ్రామాభివృద్ధికి చేసిన అప్పులు తీర్చలేక.. ఇల్లు గడవడం కష్టంగా మారడంతో ఆ గ్రామ సర్పంచి ఉపాధిహామీ పథకంలో కూలీ పనికి వెళ్తున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్త గ్రామ పంచాయతీ విశ్వనాథకాలనీకి సర్పంచిగా వల్లెపు అనిత ఎన్నికయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, పల్లె ప్రగతి పనులకు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టారు. సకాలంలో చేసిన బిల్లులు రాకపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారిందని వాపోయారు. దీంతో ప్రతి రోజూ ఉపాధిహామీ పనికి భర్తతో కలిసి వెళ్తున్నట్లు చెప్పింది. రూ.8లక్షలకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సర్పంచి పేర్కొన్నారు. అంతేగాకుండా గ్రామ పంచాయతీకి నెలకు వచ్చే రూ.40వేలు సిబ్బంది జీతాలు, విద్యుత్తు బిల్లులు, ట్రాలీ ఈఎంఐ, డీజిల్‌ ఖర్చులకు సరిపోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పెండింగ్‌ బిల్లులు ఇప్పించాలని సర్పంచి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని